బీజేపీ, బీఆర్‌ఎస్‌ ది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయం

10-10-2026 | 04:38pm

ముకరంపుర, అక్టోబర్ 10(విజయక్రాంతి) : కరీంనగర్‌(Karimnagar) లో బీజేపీ,బీఆర్‌ఎస్‌(BJP, BRS) రెండు పార్టీలు పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలకు(Match-fixing politics) పాల్పడుతున్నాయని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి(Former SUDA Chairman Komatireddy Narender Reddy) విమర్శించారు.స్థానిక నరేందర్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ఎన్నికలైనా బీజేపీ,బిఆర్ఎస్ రెండు పార్టీల నాయకులు ఒకరికొకరు తెర వెనుక సహకరించుకొని తెర ముందు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం  జరుగుతున్నదని ఇకపై ఇలాంటి డ్రామాలను ప్రజలు సహించరని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రత్యక్షంగా బీజేపీకి సహకరించిందని, తద్వారా బీజేపీ పాలకవర్గం ఏర్పాటుకు తోడ్పడిందని ఆరోపించారు.ఇప్పుడు మళ్లీ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అప్పట్లో స్పందించని నాయకులు ఇప్పుడు మాట్లాడటం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విమర్శించారు.

గణేశ్‌ నిమజ్జనానికి నీటి విడుదలపై బీజేపీ డ్రామా ఆడితే,బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై బిఆర్ఎస్ మున్సిపల్ ముట్టడి డ్రామా  అని విమర్శించారు.

కరీంనగర్ లో ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల పక్షాన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని  స్పష్టం చేశారు.ఈ సమావేశంలో కార్పోరేటర్లు వరాల నర్సింగం,పర్వతం మల్లేశం,కాంతాల జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు