సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్

10-10-2026 | 06:16pm

భారత రాష్ట్రపతి జోక్యం చేసుకొని జ్ఞానేశ్ కుమార్ ను భర్త రఫ్ చేయాలి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్

కామారెడ్డి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (Teachers' Unions' Joint Action Committee) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ  పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ తో శనివారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం(Kamareddy Municipal Office) ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కామారెడ్డి జిల్లా భాగస్వామ్య సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

భారత ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ ,ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి ,రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాలని పిలుపునివ్వాల్సింది పోయి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్  ఏకపక్షంగా, ఇతర ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు తెలిపినప్పటికీ ,స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ ఎస్ఐ ఆర్ పేరు మీద 14 కోట్ల మంది ఓటర్లను తమ ఓటు హక్కు  జాబితా నుండి ఏకపక్ష నిర్ణయాలతో తొలగించడం అప్రజాస్వామ్యం, అన్యాయం అని అన్నారు.

రాజ్యాంగ విరుద్ధంగా, ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా వ్యవహరించిన తీరును, జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయడాన్ని  నిరసిస్తూ    యూ ఎస్ పి సి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.  టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ , టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, బాబు లు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు.  భారతదేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది ఓట్లను తొలగించడం అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పెద్ద నేరమే చేశారు అనడానికి నిదర్శనం గా యూ ఎస్ పి సి భావిస్తున్నది అన్నారు.

‌ రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘం పక్షాన శ్రీనివాస్, యుఎస్పిసి భాగస్వామ్య సంఘ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్  అకాడమిక్  సెల్ కన్వీనర్ విజయరామరాజు, జిల్లా బాధ్యులు బాబు, రూప్ సింగ్, జిల్లా అధ్యక్షులు లింగం, డి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, అంబేద్కర్ సంఘం కార్యదర్శి ,గంగారం, సిఐటియు చంద్రశేఖర్, మాజీ జడ్పిటిసి కొత్తపల్లి మల్లయ్య, ఎస్సీ ఎస్టీ సంఘ ప్రతినిధి బాలయ్య, నారాయణ పిడిఎస్ యు నాయకులు సురేష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు