చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

26-09-2026 | 02:14pm

ముకరంపుర, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ(Chakali Ailamma) గారి 131వ జయంతి సందర్భంగా రేకుర్తి(Rekurthi) 19వ డివిజన్ మెయిన్ రోడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  డివిజన్ కార్పొరేషన్ సుధగోని.మాధవి-కృష్ణ గౌడ్ హాజరై ఆ మహనీయురాలి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించినారు.వారిని స్మరించికొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మన హక్కులు మనకు తెలిసేలా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని వారి అడుగు జాడలలో మీరందరూ కొనసాగాలని కోరారు.


మరిన్ని వార్తలు