కరెంటు కోత.. సమస్యల మోత!

26-09-2026 | 05:55am
  1. మఠంపల్లిలో తరచూ విద్యుత్ అంతరాయం
  2. వినియోగదారులకు కష్టకాలం
  3. పనులు కాక తప్పని అవస్థలు
  4. కరెంటు సక్రమంగా అందించాలని వేడుకోలు

మఠంపల్లి, సెప్టెంబర్ 25: మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా(Power supply) తరచూ నిలిచిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొనగా, మరోవైపు విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపాటి విద్యుత్ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం లభించకపోవడంతో గంటల తరబడి విద్యు త్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మండల కార్యాలయాలలో కరెంట్ కోతల(Power cuts) వల్ల పనులకు ఆటంకం కలుగుతుంది. అదేవిధంగా వాణిజ్య సంస్థలు, చిన్న పరిశ్రమలు, ఇళ్లలో విద్యుత్పే ఆధారపడే విని యోగదారులు తీవ్రంగా ఇబ్బందుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నా రు. దీంతో కరెంటు కోత.. సమస్యల మో తగా మారిందనే అభిప్రాయాలు స్థానికంగా వినిపిస్తున్నాయి

సిబ్బంది కొరతే సమస్యకు కారణం?

అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఉ న్న సిబ్బందిపై పనిభారం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫిర్యాదుల పరిష్కారం, లైన్ల తనిఖీ, అత్యవసర పనుల మరమ్మతుల్లో ఆలస్యమైతుందని వినియో గదారులు ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదులు పట్టించుకునేవారేరీ?

విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రతిసారి అధికారులకు, సిబ్బందికి ఫిర్యాదులు చే స్తున్నప్పటికీ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావడం లేదని ప్రజలు అంటున్నారు. మండల కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ప్రతి నేల కరెంట్ బిల్లు కొట్టించుకుంటున్నారు, కానీ కరెంట్ కోతల స మస్యలు పోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ కోతలతో పాటు, సిబ్బంది కొరతను పరిష్కరించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి 

మండల కేంద్రంలో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి,చిన్నపాటి వర్షం,గాలి వచ్చిన విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. సిబ్బంది కొరత లేకుండా చేసి ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలి.  

జాల కిరణ్ యాదవ్,  బీసీ, ఎస్సీ, 

ఎస్టీ జేఏసీ జిల్లా సభ్యులు

విద్యుత్ సమస్య లేకుండా కృషి చేస్తాం

సాధ్యమైనంత వరకు విద్యుత్ కోతలు లేకుండా కృషి చేస్తాం, ఏమైనా సమస్యలు ఉంటే పై అధికారులకు సమాచారం అందించి వాటిని పరిష్కరిస్తాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా విద్యుత్తు సరఫరాను నిరంతరంగా అందించేందుకు సిబ్బందితో కలిసి కృషి చేస్తా.

 హరీష్ రెడ్డి, ఏఈ, మఠంపల్లి

మరిన్ని వార్తలు