కిరీటం అడ్డొచ్చింది
26-09-2026 | 07:01am
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు(Hyderabad Ganesh Immersion) భారీ విగ్రహం అడ్డంకిగా మారింది. ట్యాంక్‌బండ్–రాణిగంజ్ మార్గంలో(Rani Gunj Tank Bund traffic) భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ విగ్రహం ట్యాంక్‌బండ్ కమాన్ వైపు రావడంతో పోలీసులు అప్రమత్తమై అక్కడే వాహనాలను నిలిపివేశారు. సుమారు 20 అడుగుల ఎత్తున్న విగ్రహం కావడంతో ముందుకు తరలించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. విగ్రహంపై ఉన్న భారీ కిరీటం కారణంగా మార్గంలో సమస్య తలెత్తడంతో.. దాన్ని తొలగించి విగ్రహాన్ని ముందుకు తరలించేందుకు పోలీసులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్, రాణిగంజ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిమజ్జన శోభాయాత్ర(Ganesh Nimajjanam) నేపథ్యంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.