రాంచందర్‌రావు ఆస్ట్రేలియా పర్యటన
బ్రిస్బేన్‌లో ప్రవాస భారతీయులతో భేటీ
టూవూంబా మేయర్‌తో అభివృద్ధిపై చర్చ
నేడు ఐసీఎస్ సమావేశంలో పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర చీఫ్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు(BJP State President N. Ramchander Rao)కు శుక్రవారం బ్రిస్బేన్‌కు చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన ప్రవాస భారతీయులతో సమావేశమై ముచ్చటించారు. టూవూంబా మేయర్ జెఫ్ మె క్‌డోనాల్డ్(Mayor Geoff McDonald)తో భేటీ అయ్యారు. టూవూంబా నగర అభివృద్ధి, అక్కడ పెరుగుతున్న భారతీయ సమాజం, నగర సామాజిక, ఆర్థిక రంగాల్లో భారతీయుల భాగస్వామ్యంపై మేయర్‌తో చర్చించారు.
భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన కు, భారతీయ సమాజానికి మేయర్ అందించిన ఆత్మీయ స్వాగతం పట్ల రాంచందర్‌రా వు కృతజ్ఞతలు తెలిపారు. పర్యటనలో భా గంగా 26న ఇండియన్ కల్చరల్ సొసైటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్(ఐసీఎస్) ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి రాంచందర్‌రావు హాజరుకా నున్నా రు. ప్రవాస భారతీయులతో సమావేశమై వారి సమస్యలు, సామాజిక భాగస్వామ్యం, భారత్ ఆస్ట్రేలియా ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. రాంచందర్‌రావు వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, మేడ్చల్ ఎ మ్మెల్యే మల్లారెడ్డి, స్థానిక భారతీయ సమాజ నాయకులు శ్రీకాంత్రెడ్డి తదితరులున్నారు.