శ్రీను మృతి సీఐటీయుకి తీరని లోటు

23-09-2026 | 08:45pm

ములకలపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (Telangana Gram Panchayat Workers Union) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిక్కుల శ్రీను మృతి సిఐటియు,గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కి తీరని లోటని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల పరిధిలోని సుందరయ్య నగర్ గ్రామంలో చిక్కుల శ్రీను భౌతిక కాయాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేసి అయన భౌతిక కాయంపై సిఐటియు జెండా కప్పి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... కామ్రేడ్ చిక్కుల శ్రీను తన చిన్న తనంలో కమ్యూనిస్టు భావాలతో పెరిగి ఎర్రజెండా పట్టుకుని గ్రామీణ పేదల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ ములకలపల్లి మండలంలో ఆనాటి భూస్వాములకు వ్యతిరేకంగా పేదవర్గాల పక్షాన ఎర్రజెండా పట్టుకుని పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాటాలు చేశారని చిక్కుల శ్రీనుతో పాటుగా నేను అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు.

గతంలో సిపిఎం మండల కార్యదర్శిగా పనిచేసి అమరుడైన చేడె మాధవ్ తో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణలో చిక్కుల శ్రీను కీలక పాత్ర పోషించారని అన్నారు.సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ కామ్రేడ్ శ్రీను మరణం సిఐటియు కి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కి తీరని లోటని అన్నారు.ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పై పోరాటాల్లో కార్మికులందరిని సమన్వయం చేసి పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించారని తెలిపారు.

గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మండల అధ్యక్షుడుగా కొనసాగుతున్న కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం  చాలా బాధాకరమని ఆయన మరణం సిఐటియు కి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు చేడె పద్మ,సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి గంటా శ్రీనివాసరావు,వర్క రుక్మధరావు,మేకల రమేష్, కారంపూడి సాయి రత్న, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు