వాసవి క్లబ్ ఆవిర్భావ దినోత్సవం
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ దినోత్సవాన్ని(Vasavi Club Foundation Day) పురస్కరించుకుని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి క్లబ్ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి పండ్లు అందజేశారు.
ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసవి క్లబ్ ఆసిఫాబాద్ అధ్యక్షుడు మర్యాల ఉదయ్ బాబు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా అనేక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
అవసరమైన వారికి సహాయం అందించడం, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా సమాజానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, వాసవి ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు మల్టిపుల్ ఎక్కిరాల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, గంధం శ్రీనివాస్, మాజీ వాసవి క్లబ్ అధ్యక్షులు కొలుపాక శంకర్, వేణు, పాత శ్రీనివాస్, ప్రస్తుత సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.