విద్యార్థులు లక్ష్య సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

23-09-2026 | 10:26pm

మహబూబ్‌నగర్: ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ శిక్షణ కేంద్రంలో గణపతి పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) సతీమణి లక్ష్మి ప్రసన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం అన్నదానం ప్రారంభించి, విద్యార్థినులు, శిక్షకులతో కలిసి కోలాటం ఆడారు. విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి శిక్షణ కేంద్రం ప్రాంగణంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు గుండా మనోహర్, ఇన్‌చార్జి నిజలింగప్ప, అనిల్, శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు