డంపుయార్డు పై రాజకీయాలు వద్దు

16-10-2026 | 07:16pm

సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

ముకరంపుర, అక్టోబర్ 16(విజయ క్రాంతి): డంపుయార్డు వల్ల ఒకవైపు ప్రజలు ప్రతిరోజూ ఇబ్బంది పడుతుంటే సమస్యను ఒకరిపై ఒకరు నెట్టి వేసుకొని రాజకీయ లబ్ధికోసం ప్రాకులాడటం ఏంటని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former SUDA Chairman Komatireddy Narender Reddy) అన్నారు.స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బయో మైనింగ్ చేయడంలో చెప్పడం జరుగుతుందని,

ఒక్క మిషన్ తో రోజుకు 5 వందల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ బయోమైనింగ్ చేయలేమని దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకు పోయి ఉందని ప్రతి రోజు చేసినా 3 సంవత్సరాలు పడుతుందని అదీకాక మళ్లీ ప్రతిరోజూ ఫ్రెష్ వెస్ట్ 2 వందల మెట్రిక్ టన్నులు జమ అవుతుందని అన్నారు.సమస్య పరిష్కారం కావాలంటే ప్రతిరోజు 2 వేల మెట్రిక్ టన్నులు బయోమైనింగ్ చేయగలిగితే ఒక సంవత్సరంలో ఉన్న చెత్త మొత్తం క్లియర్ చేయ గలుగుతామని దానికోసం ఒక ప్రణాళిక ప్రకారం కలిసికట్టుగా కృషి చేస్తేనే అది సాధ్యం అవుతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

యూసీఎఫ్ నిధులు సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయించుకొని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు.తడి చెత్త  పొడి చెత్త వేరుగా సేకరించడంలో పాలకవర్గాలు విఫలం అవుతున్నాయని మానిటరింగ్ సరిగా చేస్తే ఫ్రెష్ వెస్ట్ ను తగ్గించవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతానికి పొగ బారినుండి ఉపశమనం పొందేందుకు నాలుగు వైపులా బోర్లు వేసి స్పింక్లర్స్ ఏర్పాటు చేస్తే సత్వరం పరిష్కారం దొరుకుతుందని నిపుణుల సూచన మేరకు ఆదిశగా ప్రయత్నం చేయాలని నరేందర్ రెడ్డి కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని నరేందర్ రెడ్డి అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో  మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ ఎండి తాజ్,కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, వరాల నర్సింగం,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,మామిడి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు