పెగళ్లపాడు లో అన్నదాన కార్యక్రమం

16-10-2026 | 08:10pm

ఎర్రుపాలెం అక్టోబర్ 16 (విజయక్రాంతి); దసరా నవరాత్రుల(Dussehra Navratri) సందర్భంగా పెగల్ల పాడులో మహా అన్నదాన కార్యక్రమాన్ని(Maha Annadana Program) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు(Madhira AMC Chairman Bandaru Narasimha Rao) సర్పంచి కాకర్లమూడి అనిల్ తో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో దసరా నవరాత్రులు పండుగ పురష్కరించుకొని  ఆంజనేయ స్వామి గుడి దగ్గర గూడూరు తిరుపతిరెడ్డి రాజేశ్వరి  ఐలూరు కృష్ణారెడ్డి రమ్య  కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ చంద్రశేఖర్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు  వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సగ్గుర్తి వెంకటనారాయణ ,  గ్రామ ఉపసర్పంచ్ గూడూరు నాగలక్ష్మి  , గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యరమల కోటిరెడ్డి , సగ్గుర్తి శ్రీనివాస్ రావుగారు, పాలకవర్గ సభ్యులు, మండల వివిధ గ్రామాల సర్పంచులు మరియు మాజీఎంపీటీసీలు, మాజీజడ్పిటిసిలు మాజీ సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు గ్రామమహిళలు, గ్రామ యూత్ సభ్యులు పంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు