రైతుల ముసుగులో.. గోవుల అక్రమ తరలింపు

16-10-2026 | 08:16pm

వాహనాన్ని అడ్డుకొని.. గోవులను గోశాలకు తరలించిన స్థానిక యువకులు

సింగరేణి అక్టోబర్ 16 విజయ క్రాంతి: రైతుల(Farmers) ముసుగులో.. కొంతమంది వ్యక్తులు గోవులను వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా..  స్థానిక యువకులు వాహనాన్ని వెంబడించి అడ్డుకున్న ఘటన కారేపల్లి - ఇల్లందు ప్రధాన రహదారిలోని సోలార్ ప్లాంట్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం ప్రాంతం నుంచి డీసీఎం వాహనంలో సుమారు 15 గోవులను(cows),  ఇల్లందు, మహబూబాబాద్ వైపు కొంతమంది వ్యక్తులు తరలిస్తుండగా. . గమనించిన కారేపల్లి యువకులు వాహనాన్ని వెంబడించి,  సోలార్ ప్లాంట్ వద్ద అటకాయించారు. 

ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఇల్లందు గో సంరక్షణ సమితి సభ్యులు,  కారేపల్లి విశ్వహిందూ పరిషత్తు సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని. . గోవులను తరలిస్తున్న వ్యక్తులను నిడదీశారు.  తాము రైతులమని చెప్పుతూ పొంతన లేని సమాధానాలతో పాటు,  వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో. . గోవులను వాహనంతో పాటు ఖమ్మంలోని గొల్లగూడెం గోశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షణ సమితి సభ్యులు ,విశ్వహిందూ పరిషత్తు సభ్యులు జంగా వెంకటేశ్వర్లు, వైభవ్ మనియార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు