జనాభా గణన రెండో దశపై అధికారులకు శిక్షణ

16-10-2026 | 08:22pm

మహబూబ్‌నగర్, (విజయక్రాంతి): జిల్లాలో జనాభా గణన(Census) రెండో దశను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని జనాభా గణన విభాగం డైరెక్టర్ భారతి హోలీకేరి(Bharati Holikeri) సూచించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో(Mahabubnagar Collectorate) జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి ఖుష్బూ గుప్తా సమక్షంలో ఛార్జ్ క్లర్కులు, సాంకేతిక సహాయకులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా భారతి హోలీకేరి మాట్లాడుతూ జనాభా గణనలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన శిక్షకులు దయానందం, శివరామకృష్ణ జనాభా గణన విధివిధానాలు, సాంకేతిక అంశాలపై(Technical aspects) శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, సహాయ కలెక్టర్ సాయి శివాని, జిల్లా జనాభా గణన అధికారి బి. నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు