నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల అందజేత
పాల్వంచ, (విజయక్రాంతి): నవ లిమిటెడ్ ,పాల్వంచ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో(Palvancha Corporate Social Responsibility Program) భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో శుక్రవారం టాలీ, డిటిపి కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు యోగ్యత పత్రాల అందజేశారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శంభు ప్రసాద్(Education Department Official S. Shambhu Prasad) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిటిపిలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థి సత్య, మాట్లాడుతూ నవ మహిళా సాధికార కేంద్రం తమలాంటి వారికి ఎందరికో ఉచిత శిక్షణ అందిస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని, ఇక్కడ నేర్చుకున్న శిక్షణ ద్వారా చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని తెలిపారు. మహిళా సాధికార కేంద్ర ప్రతినిధి ఎం.శ్రీనివాసరావు, మాట్లాడుతూ 1975లో నవ భారతి సంస్థ ప్రారంభించిన నాటి నుండి సంస్థ అభివృద్ధి తో పాటు పరిసర ప్రాంతాలలో మౌలిక వసతులకు ఆనాడే శ్రీకారం చుట్టింది అని తెలిపారు, పరిసర ప్రాంతలలోని ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలు,దంత పరీక్షలు నిర్వహించటం జరిగింది అనీ తేలిపారు. ఈ మహిళా సాధికార కేంద్రంలో ఇప్పటివరకు 5,500 మందికి పైగా వివిధ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.
ముఖ్య అతిథి ఎస్. శంభుప్రసాద్ మాట్లాడుతూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మహిళలు భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని, ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల కల్పనలో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి నవ లిమిటెడ్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డి. సుధాకర్,హెడ్ - సి ఎస్ ఆర్, పి.రమేష్, డి జి ఎమ్ మెకానికల్ ఆపరేషన్స్, నవ భారత్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఏం.వి.కే.ప్రసాద్, నవ మహిళా సాధికార కేంద్రం సిబ్బంది శిరీష ,దివ్య,అరుణ పాల్గొన్నారు.