ఎక్సైజ్ అధికారుల ఉమ్మడి దాడులు

11-10-2026 | 10:03pm

పట్టుబడ్డ 50 లీటర్ల ఎఫ్ జె వాష్

కొత్తపల్లి, అక్టోబర్ 11(విజయక్రాంతి) : కరీంనగర్ రూరల్(Karimnagar Rural), అర్బన్ తిమ్మాపూర్ ఎక్సైజ్ అధికారులు(Thimmapur Excise officials) ఉమ్మడిగా కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ సూపరిండెంట్ సంతోష్ రెడ్డి(Excise Superintendent Santosh Reddy) ఆదేశాలతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. కరీంనగర్ రూరల్ పరిధిలోని  వెదురుగట్ట జూబ్లీ నగర్ చామనపల్లి లలోని పలు ప్రాంతాలలో  దాడులు చేయగా 50 లీటర్ల ఎఫ్ జె వాష్ దొరికినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ సీఐ రామ్మూర్తి , అర్బన్ ఎక్సైజ్   ఇన్స్పెక్టర్ వేణుమాధవ్, తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్సై సింధు మరియు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు