పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
13-09-2026 | 01:47pm
ముకరంపుర, సెప్టెంబర్ 13(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 12వ డివిజన్ హస్నాపూర్(Hasnapur) ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న HDPE పైప్లైన్ నిర్మాణ పనులకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథులుగా హాజరై స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ-వేణు తో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
డివిజన్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులను చేపట్టామని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.