ప్రజల్లోకి కేంద్ర పథకాలు తీసుకెళ్లాలి..

25-10-2026 | 02:32pm

కార్యకర్తలకు గంగాడి కృష్ణారెడ్డి పిలుపు

హుజూరాబాద్‌లో టిఫిన్ బైఠక్, మన్ కీ బాత్ కార్యక్రమాలు

హుజూరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని విద్యానగర్ సస్త్ర స్కూల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర పరిధి టిఫిన్ బైఠక్, మన్ కీ బాత్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి(Gangadi Krishnareddy) హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సోషల్ మీడియా ద్వారా కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, సెంట్రల్ ఫిలిం బోర్డు సభ్యుడు సబ్బని రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గంగిశెట్టి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులు తిప్పభత్తిని రాజు, గంట సంపత్, కౌన్సిలర్ పంజాల మనోజ్, సీనియర్ నాయకులు యాంసాని శశిధర్, కోశాధికారి క్యాష వెంకటేష్, గోపాల్ రెడ్డి, బోరగాల సారయ్య, నరాల రాజశేఖర్, బొంగోని ప్రవీణ్ కుమార్, అంకటి వాసు, మొలుగూరి అపర్ణ, చెత్తర్ సింగ్, కొలుగూరి అనిల్, నీలం రవీందర్, పురాణం శ్రీనివాస్, తూర్పాటి సురేష్, పర్ధం విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు