పట్టెడ అవల్ దేవస్థానంలో ప్రత్యేక ఎమ్మెల్యే పూజలు

25-10-2026 | 03:08pm

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

ఉట్నూర్ (విజయక్రాంతి): మహారాష్ట్ర రాష్ట్రం చంద్రపూర్ జిల్లాలోని పట్టెడ అవల్ దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం పూజలు నిర్వహించిన అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థించి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే వాతావరణ, వ్యవసాయ సవాళ్లను ప్రజలందరూ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని, ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలిచే శక్తిని ప్రసాదించాలని వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను ఘనంగా ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు