దుర్గాదేవి ఉత్సవ విగ్రహ నిమజ్జన శోభాయాత్ర

25-10-2026 | 03:03pm

నిర్మల్ అక్టోబర్ 25 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయం(Srigiri Nandigundam Durgamata Temple)లో ఆదివారం దుర్గామాత ఉత్సవ విగ్రహ సామూహిక నిమజ్జనం ఆలయ వ్యవస్థాపకులు కొండాజి వెంకటాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిమజ్జన శోభాయాత్ర కు పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు వెంకటాచారి మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీగిరి నందికున్న దుర్గామాత ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించామని మహారాష్ట్ర నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల నలుమూలల నుంచి వేలాదిమంది ఆ అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు.

దసరా తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున దుర్గామాత ఆలయంలో నెలకొల్పిన ఉత్సవ విగ్రహాన్ని బంగాల్పేట్ వినాయక సాగర్ లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సేవలందించిన వారందరికీ ఆ అమ్మవారి కృప కటాక్షములు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగా మాత శ్రీనివాస్, ఆలయ పూజారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు