శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో బాలికా విద్యా కార్యక్రమం
కొత్తపల్లి, అక్టోబర్ 09(విజయక్రాంతి): శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో(Sri Saraswati Shishu Mandir School) శుక్రవారం రోజున బాలికా విద్యా కార్యక్రమాన్ని(Girls education program) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికల విద్య ప్రాముఖ్యత, మహిళా సాధికారత, భారతీయ సంస్కృతి(Indian Culture), సంప్రదాయాల పరిరక్షణ గురించి వివరించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా శ్రీమతి బోడ్ల గీతారాణి, శ్రీమతి అప్పిడి వకుల దేవి పాల్గొని బాలికల విద్య, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం గురించి ప్రసంగించారు.
బాలికలు విద్యలో రాణిస్తూ అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించాలని వారు సూచించారు.అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థినులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ప్రేమ, ఐకమత్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థినులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో విద్య పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవభావాన్ని పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యం కృషి చేసింది. కార్యక్రమంలోపాఠశాల ప్రధానచార్యులు మోర రణధీర్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, గట్టు శ్రీనివాస్, ఎలగందుల సత్యనారాయణ, ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, బొడ్ల శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, తాటి రాజేశ్వర్ రావు, కొత్తూరు ముకుందం, కోట లక్ష్మారెడ్డి, డా. పోరండ్ల కిషన్, ఆచార్యులు, మాతాజీలు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.