పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
హుజూరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం (Equality), విద్యాభివృద్ధి (Education), సామాజిక న్యాయం (Social Justice) సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్య, సమాన హక్కుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూలే కమిటీ చైర్మన్ రఘు చారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుపతి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.