మాదకద్రవ్యాలు సమాజానికి చేటు

28-11-2026 | 12:24pm

బెజ్జంకి (విజయక్రాంతి): మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను నాశనం చేయడంతో పాటు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందని ఏసీపీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో ఎస్‌ఐ తోట తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ (Cordon Search) నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నాలుగు కిరాణా దుకాణాల్లో మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు (Drugs) దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను నిరంతరం గమనించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు (Police) సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ భరత్ కుమార్ మాట్లాడుతూ విద్యతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు (Education) సాధ్యమవుతుందని అన్నారు. కార్డన్ సెర్చ్‌లో పోలీసు ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు