స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు

27-10-2026 | 10:04pm

పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి మాత శిశు సంరక్షణ ప్రత్యేక అధికారిని  డా. సనా జివేరియా

హుజురాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): హుజురాబాద్ పట్టణంలోని స్కానింగ్ కేంద్రాల్లో(Huzurabad Scanning Centers) జిల్లా మాతా శిశు సంరక్షణ ప్రత్యేక అధికారి డాక్టర్ సనా జివేరియా, హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్‌తో కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కానింగ్ కేంద్రాల్లోని రికార్డులను పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

ప్రతి స్కానింగ్‌కు సంబంధించిన రిఫరల్ స్లిప్పులను భద్రపరచాలని, ఫామ్‌-ఎఫ్ రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రతి నెలా రికార్డుల ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. 

గర్భిణులకు స్కానింగ్ నిర్వహించిన సమయంలో పిండం ఆడా, మగా అనే విషయాన్ని వెల్లడించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ వివరాలు వెల్లడించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా మాతా శిశు సంరక్షణ ప్రత్యేక అధికారి డా. సనా జివేరియా మాట్లాడుతూ, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.

మరిన్ని వార్తలు