సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా ప్రకటించాలి

16-09-2026 | 06:04pm

కొత్తపల్లి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా(Karimnagar District) తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో సిపిఐ తిమ్మాపూర్ మండల కార్యదర్శి కామ్రేడ్ బోయిని తిరుపతి ఆధ్వర్యంలో పోలంపల్లి పులిబిడ్డ పోరు తల్లి ముద్దుబిడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ అనబెరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

అనంతరం సీపీఐ  జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రైతంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి ఆ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి అరభేరి లాంటి ముఖ్య నాయకుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. చరిత్ర వాస్తవాలను పక్కకు పెట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.

తెలంగాణ ప్రాంత ప్రజలను పీడిస్తూ వ్యక్తి చాకిరి బానిసత్వం కొనసాగిస్తూ మహిళలపై అత్యాచారాలు చేస్తూ ధమనకాండ నిర్వహించారు దీనికి వ్యతిరేకంగా అనభేరి ప్రభాకర్ రావు  లాంటి యోధులు విరోచిత పోరాటం చేసి కరీంనగర్ జిల్లాలో సుమారు 40 గ్రామాలను దత్తత తీసుకొని రజాకార్ల నుండి కాపాడుకొని కరీంనగర్ జిల్లా మొట్టమొదటి సీపీఐ కార్యదర్శిగా కొనసాగి సాయుధ పోరాట పిలుపునందుకొని అజ్ఞాతంలోకి పోయి  నిజాం నవాబు తెలంగాణ సంస్థానాన్ని విడిచి వెళ్లేంతవరకు ఆయన పోరాటాన్ని కొనసాగించారు.

మరోపక్క నిజాంకు తొత్తులుగా ఉన్నటువంటి దొరలు దేశ్ముకులు పల్లెల్లో ఉన్నటువంటి పేద ప్రజలను పట్టిపీడిస్తున్నారు కష్టపడి పండించిన పంటను వారి గోడౌన్లకు తరలించుకుంటున్నారు వీటన్నిటి పైన తిరుగుబాటు చేసి దొరలను భూస్వాములను గడగడలాడించి పేద ప్రజలను కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషించినాడని ,ప్రభాకర్ రావు దత్తత తీసుకున్న గ్రామాలలో రజాకార్లు కాలు కూడా పెట్టలేదంటే అతను ఎంతటి వీరుడో నేటి తరానికి తెలియజేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది కావున సాయిధ పోరాటాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి సెప్టెంబర్ 17న విలిన దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. 

మరిన్ని వార్తలు