అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

29-10-2026 | 09:52pm
  1. బెల్లంపల్లి,కాసీపేట,తాండూర్ మండలాల్లో కలెక్టర్ విజిట్ 
  2. స్పెషల్ ఆఫీసర్ కు షోకాజ్ నోటీస్ 

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్ మండలాల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) గురువారం సుడిగాలి పర్యటన చేశారు. జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు.

కాసిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

వంటశాలను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. రేకులగూడలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను మండల పంచాయతీ అధికారి సబ్దర్ అలీతో కలిసి వెళ్లి పాఠశాలలోని సౌకర్యాలను పరిశీలించారు. 

స్పెషల్ ఆఫీసర్ కు షో కాజ్ నోటీసు..

తాండూర్ మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న డి.ఎ. జుగా వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించి, కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న భోజనశాల పనులను పరిశీలించారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

వంటశాలను తనిఖీ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన సందర్భంగా, విద్యార్థులకు సరైన విద్యా వాతావరణం కల్పించడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించి, సంబంధిత స్పెషల్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.

అనంతరం బెల్లంపల్లిలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతా గా,నిర్ణీత గడువులో పూర్తి చేయాలని  అధికారులకు సూచించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి నియోజకవర్గ పరిధిలోని తహసిల్దార్లతో సమావేశం అయ్యారు.

భూభారతి, భూదాన్ భూములు, రెవెన్యూ సంబంధిత అంశాలు తదితర అంశాలపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, రెవెన్యూ సమస్యలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని, చేపట్టిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు