యాసంగిలో ఆరుతడి పంటల సాగు చేయ్యాలి
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి రైతువేదికలో యాసంగిలో పండించలవలసిన ఆరుతడి పంటలపై శనివారం రోజున అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ(Additional Collector Dr. Ashwini Tanaji) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యాసంగి సీజన్(Yasangi season)లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని,నేల ఆరోగ్యం, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పంటను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
తదుపరి జిల్లా వ్యవసాయ అధికారి చతృనాయక్(District Agriculture Officer Chatru Naik) మాట్లాడుతూ యాసంగిలో తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలు వేసుకోవాలని,నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకావాలని తెలియజేశారు .తదుపరి టీఆర్వికె శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ రావు మాట్లాడుతూ యాసంగిలో వరి పంటకు బదులుగా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, కుసుమ, ఆముదం, కంది, పెసర, మినుము, శనగ తదితర పంటలను సాగు చేసుకోవచ్చునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కె రణదీర్ రెడ్డి, కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారి కోట సంతోష్ కుమార్,ఉద్యానవన శాఖ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు,వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.