ప్రభుత్వ అధికారిక ప్రకటన
అధికారికంగా ప్రకటించిన తెలంగాణ
హుజురాబాద్,(విజయక్రాంతి): వీర నారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు నిమ్మటూరి సాయికృష్ణ నియామకమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి అధికారిక ఉత్సవ కమిటీలో మొత్తం 30 మంది కన్వీనర్లకు ప్రభుత్వం స్థానం కల్పించింది. ఈ కమిటీలో నిమ్మటూరి సాయి కృష్ణకు స్థానం కల్పించడంపై పట్టణానికి చెందిన ప్రముఖులు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సాయి కృష్ణ మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలను ఈనెల 26 న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేలా కృషి చేస్తానన్నారు. తననియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. సాయి కృష్ణ నియామకం పట్ల హుజురాబాద్ రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కొండపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్, సీనియర్ రజక సంఘం నాయకులు, బిజెపి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.