యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమం
ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ(Satavahana University) కామర్స్ కళాశాలలో కామర్స్ & బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగానికి చెందిన జాతీయ సేవా విభాగ యూనిట్–IIIకు చెందిన 8 మంది విద్యార్థి వాలంటీర్లు ఈనెల 16 నుండి 22 వరకు నిర్వహించిన ఏడు రోజుల యువ ఆపద మిత్ర శిక్షణా కార్యక్రమం(Yuva Aapada Mitra training)లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన దళం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా(Mancherial District) గుడిపేట బేటాలియన్ క్యాంపు లో నిర్వహించిన ఈ శిక్షణలో విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం అందించేందుకు అవసరమైన ప్రాథమిక జ్ఞానం, ప్రాయోగిక నైపుణ్యాలను వాలంటీర్లు పొందారు. విపత్తుల సమయంలో సమాజానికి సేవ చేయడానికి విద్యార్థుల్లో సేవాభావం, బాధ్యత, క్రమశిక్షణ మరియు విపత్తు నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడిందని వారు పేర్కొన్నారు.