విజేతలకు బహుమతులు పంపిణీ

25-10-2026 | 06:42pm

ముకరంపుర, అక్టోబర్ 25(విజయక్రాంతి): రేకుర్తి 19వ డివిజన్లో నిర్వహించిన కీశే!! సుధగోని నర్సయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్‌లో(Cricket tournament) విజేతలుగా నిలిచిన జట్లకు 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్(Sudhagoni Madhavi-Krishna Goud)  బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ క్రీడలు యువతలో(Sports and Youth) క్రమశిక్షణ, ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. యువత చదువుతో(Education) పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను, పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ మండలం ఫ్యాక్స్ మాజీ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి. అజయ్.నేరెళ్ల టోర్నమెంట్ నిర్వాహకులు, మునీర్ ఖాన్. మెహెరాజ్ క్రీడాకారులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు