పరిపాలకులకు.. వ్యక్తిగత కక్షలు ఉండకూడదు

25-10-2026 | 07:13pm

పదవి గొప్ప కాదు ఆ పదవికి న్యాయం చేస్తున్నామనేదే ముఖ్యం.      

రేవంత్ కాలగర్భంలో కలిసిపోతావా? ప్రజల మధ్య ఉంటావా తేల్చుకో?        

మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్.                           

జవహర్ నగర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): పరిపాలకులకు వ్యక్తిగత కక్షలు ఉండకూడదని పదవులు గొప్ప కాదని ఆ పదవికి న్యాయం చేస్తున్నామని ముఖ్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Eatala Rajender) పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో నెలకొని ఉన్న డంపింగ్ యార్డ్(Dumping yard) వల్ల కాలుష్య నియంత్రణకు డంపింగ్ యార్డ్ సమస్యల నుండి శాశ్విత పరిష్కారం కోసం హైదరాబాద్ టూరిజం హోటల్లో పర్యావరణ ప్రజా సంఘాల(Environmental public associations) ఆధ్వర్యంలో ఆదివారం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై మాట్లాడుతూ, మేధావులు పర్యావరణవేత్తలు డంపింగ్ యార్డ్ వల్ల ఎదుర్కొంటున్న బాధలను వివరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ జవహర్ నగర్(Jawahar Nagar) లో గరీబోళ్ళు ప్రాణాలు అరచేతుల పెట్టుకొని జీవిస్తున్నారని ఈ విషయమై కంచెయే చేను మేసినట్టు పాలకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు చట్టాల మీద నమ్మకం పోతుందని రామ్కి డబ్బు పలుకుబడితో కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు.

ఇటీవలే జవహర్ నగర్ లో కుక్కలు ఒక బాబును పీక్కొని తిన్న ఘటన మరువలేమని తెలిపారు. రాంకి సిఎస్ఆర్ డబ్బులు ఇక్కడ తాగునీరు రోడ్లు ప్రజలకు ఖర్చు చేయకుండా వేరే రాష్ట్రాల్లో ఖర్చుపెడుతుందన్నారు. మేము మొదటగా కలిసింది సీఎం రేవంత్ రెడ్డిని జవహర్ నగర్ ప్రజల కోసమేనని తెలిపారు. ప్రశ్నించే గొంతుక అధికారాన్ని చేపట్టావు కానీ దీనిని పరిష్కారం చేయాలని కోరితే మీరే మీటింగ్ పెట్టండి అని చెప్పావు కానీ కానీ ఇంతవరకు ఈ విషయమై చిత్తశుద్ధి లేకపోవడం దారుణం అన్నారు.

ఇంతకుముందు డంపింగ్ యార్డ్ సమస్య గురించి పార్లమెంటులో మాట్లాడాలని కేంద్రమంత్రి కట్టర్ ను కలిసి వివరించానని తెలిపారు. ఢిల్లీలో కోట్ల టన్నుల చెత్తను రీసైకిల్ చేస్తున్నారు చెత్తను ఎలక్ట్రిసిటీ జనరేషన్ బయోగ్యాస్ ఆర్గానిక్ మెన్యూర్ గా చేయవచ్చునని అలాంటి ప్లాంటు పెట్టండి అని సూచించారు. చెత్త ఏరుకునేవాళ్లు మా దగ్గరికి వచ్చి రామ్కీ చెత్త కూడా ఏరుకొనివ్వ కుండా ఆ పని కూడా వాళ్లే చేస్తారట డబ్బులు సంపాదించుకో కానీ ఇలా సంపాదించకు అని తెలిపారు.

ఈ పరిణామాలు నిరసిస్తూ ఈనెల 27వ తేదీ నుండి పాదయాత్ర మొదలు పెడుతున్నానని తెలిపారు. రాజకీయంలో పదవి గొప్ప కాదని ఆ పదవికి ఎంత న్యాయం చేస్తున్నామన్నదే ముఖ్యమని రేవంత్ రెడ్డి ఇకనైనా మేల్కొని డంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం చూపించాలనీ లేకపోతే కాలగర్భంలో కలిసిపోతావని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంపీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్, కేశపాక రామచంద్ర,  నరసింహారావు, శ్రీకృష్ణ, వండ్రపల్లి శివ, వెంకటేశ్వర్లు, మేధావులు, ప్రొఫెసర్లు, జిహెచ్ఎంసి మాజీ మేయర్, వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు