ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు

17-09-2026 | 03:40pm

కరీంనగర్ సిటీ సెప్టెంబర్17(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర విలీన దినోత్సవ సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం హాజరై  కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంమాజీ సుడా  చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తో పాటు పార్టీ శ్రేణుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు పంచుతూ, బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం  మాట్లాడుతూ..భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే, తెలంగాణ రాష్ట్రం అఖండ భారతావనిలో విలీనమైంది 1948 సెప్టెంబర్ 17న. ఆ రోజు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి సారథ్యంలో, వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అఖండ భారతావనిలో విలీనం కావడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం కోసం నాడు సాయుధ పోరాటం నుంచి మొన్నటి వరకు అనేక పోరాటాలు జరిగాయి. 2014లో UPA చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో 60 సంవత్సరాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రి అయిన తర్వాత సెప్టెంబర్ 17వ తేదీని  ప్రజా పాలన దివస్గా ప్రకటించుకొని ప్రతి సంవత్సరం ఈ సంబరాలు జరుపుకుంటున్నాం.

ఈ సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజా పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చూస్తున్నాం, ముందు ముందు మరిన్ని చూడబోతున్నాం" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పుల అంజనీ ప్రసాద్, ఎండి తాజ్, మడుపు మోహన్, కొరివి అరుణ్ కుమార్ ,పర్వత మల్లేశం, గుమ్మడి రాజకుమార్, కాంతాల జగన్ రెడ్డి, కామ్ రెడ్డి రామ్ రెడ్డి,ముస్తాక్, పత్తి మధుకర్, అహమ్మద్ అలీ, మాదాసు శ్రీనివాస్, కుంభాల రాజకుమార్, హస్తపురం తిరుమల,మాలోతు మహాలక్ష్మి, రామిడి తిరుపతిరెడ్డి, వంగల  విద్యాసాగర్,కంకణాల అనిల్ కుమార్ గుప్తా,మూల జయపాల్, అందే శంకర్, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొబ్బిలి విక్టర్, సుకుర్ మహమ్మద్, రాచర్ల పద్మ, శ్రీకాంత్, సాయిని తిరుపతి, శిల్ప తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు