వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు
17-09-2026 | 06:36am
తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు(Tirumala Srivari Brahmotsavam) అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు గురువారం ఉదయం సింహవాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. రాత్రి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారని ఆలయ అధికారులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల వేళ గోవింద (Govinda Namalu)నామస్మరణలతో తిరు గిరులు మార్మోగుతున్నాయి. భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా తిరుమల ఒక కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(Chief Minister N. Chandrababu Naidu) 'హీలింగ్, డివోషన్ సెంటర్', 'దుర్లభ దర్శన్ VR', 32 ఈ-బస్సులు, ఆధునీకరించిన ఎస్.వి. (SV) మ్యూజియం, గ్రూప్ ఇన్సూరెన్స్, 'నందకం' యాప్‌లను ప్రారంభించారు.