వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదు

17-09-2026 | 05:45am

దామాషా ప్రకారం సీట్లు పెరిగితే డీలిమిటేషన్‌కు మద్దతు 

జిందాల్ గ్లోబల్ వర్సిటీలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి) : 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నిక(Assembly election)ల్లో బీజేపీ(BJP)తో ఎలాంటి పొత్తు ఉండదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశా రు. లోక్‌సభ స్థానాల సంఖ్య(Number of Lok Sabha seats)ను దామాషా ప్రకారం పెంచితే, డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill)కు మద్ద తు ఇవ్వడంలో బీఆర్‌ఎస్‌కు అభ్యంత రం ఉండదని తెలిపారు. బుధవారం ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ(OP Jindal Global University)లో ‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్’ అనే అంశంపై కేటీఆర్ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు.

అనంతరం విద్యార్థులతో ముఖా ముఖిగా రాజకీయాలు, పాలన, సాంకేతికత అంశాలపై పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చా రు. ప్రతి పెద్ద సాంకేతిక పరివర్తన సమ యంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయ ని, ఏఐ విషయంలోనూ సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని కేటీఆర్ విద్యార్థులకు సూచించారు. అనంతరం సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణ చేపట్టిన వివిధ కార్యక్రమాల గు రించి వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కరు వు ప్రభావిత తెలంగాణ ప్రాంతాలకు గోదా వరి జలాలను ఎలా తరలించాలనే చారిత్రక సవాలుకు ఇంజినీరింగ్ పరిష్కారంగా అభి వర్ణించారు. పరిమితులను సమస్యలుగా చూడకుండా నిరంతరం నేర్చుకోవడం, మె రుగుపడటం, వాటిని అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం రాజకీయాలు, ప్రజా విధానాలపై విద్యార్థుల కు కేటీఆర్ వివరించారు. 

దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టాలి 

ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు తాత్కాలికంగా స్పందించడం కాకుండా సమగ్ర, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించాలని అన్నారు. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంట ర్‌లో జనాగ్రహ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘షెహెరోన్ పే చర్చా’లో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణలో బీఆర్‌ఎస్ హయాంలో అమ లు చేసిన విధానాలు, పట్టణాభివృద్ధి కార్యక్ర మాలను వివరించారు. ప్రతి జిల్లా కేంద్రం లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పాటు అనేక టైర్- నగరాల్లో ఐటీ టవర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

అపర భగీరథుడు కేసీఆర్ 

ఉమ్మడి పాలనలో కరువు, వలసలకు నిలయంగా ఉన్న పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని కేటీఆర్ అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నార్లాపూర్ పంపులను ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సం దర్భంగా ఆయన ఈ మేరకు స్పందించారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘ నత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు