ప్రధాని మోదీకి నితిన్ నబిన్ బర్త్ డే విషెస్
17-09-2026 | 09:13am
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(Narendra Modi) ఆయన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్(BJP President Nitin Nabin) గురువారం శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి, స్వయం సమృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని పేర్కొంటూ, ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షించారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వద్‌నగర్‌లో జన్మించిన మోదీకి గురువారం నాటికి 76 ఏళ్లు నిండాయి. "దేశంలోని 140 కోట్ల మంది ప్రజల నాయకుడు, దేశ సేవ, అంకితభావానికి నిలువుటద్దం అయిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(Prime Minister Narendra Modi) హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు." తెలుపుతూ 'X' వేదికగా హిందీలో నబిన్ పోస్ట్ చేశారు.