ఉల్లంఘనపై కొరడా ఝులిపిస్తారా?

17-09-2026 | 05:10am
  1. కార్మిక చట్టాల ఉల్లంఘన.. 
  2. పరిశ్రమపై చర్యలకు ఫిర్యాదు
  3. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ లేకుండానే కార్మికులతో పని?
  4. కార్మికుల హక్కులకు భంగం.. 
  5. పరిశ్రమపై విచారణకు డిమాండ్..
  6. కలెక్టర్‌కు ఫిర్యాదు 

బాలానగర్, సెప్టెంబర్ 16: కార్మిక చట్టాలను(Labour laws) పరిశ్రమల(Industries)లో పకడ్బందీగా అమలు చేయాలంటూ డిమాండ్ రోజురోజుకు అందుకుంటుంది. సంబంధిత అధికార యంత్రం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు ప్రత్యేకం చర్చ జరుగుతుంది. లేని చట్టాలు దేవుడెరుగు కార్మికుల సంక్షేమం(Workers Welfare) కోసం ఉన్న చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తే కార్మికులకు పూర్తిస్థాయిలో మేలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని కార్మికులు చెబుతున్న మాట. ఈ విషయాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి అడుగులు వేస్తే అందరికి మేలు జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. 

ఉన్న చట్టాలు అమలు జరుగుతున్నాయా? 

కార్మికులకు కొత్త చట్టాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఉన్న చట్టాలు పూర్తిస్థాయిలో అమలు చేస్తే చూడాలని ఉందని కార్మికులు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలోని ఎంఎస్ ఆమ్స్ప్రో ల్ఫైు్సన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(MS Amspro Lifesciences Private Limited) పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలో గత 45 ఏళ్లుగా జనరల్ షిఫ్ట్లో సుమారు 150 మంది, ఇతర షిఫ్టుల్లో మరో 40 మంది కార్మికులతో పని చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కార్మికులకు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, కనీస వేతనాలు చెల్లించకుండా కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. సమస్యలను ప్రశ్నించే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. పరిశ్రమ లేబర్ కార్యాలయంలో నమోదు కాలేదని ఆర్టీఐ ద్వారా సమాచారం అందినట్లు పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను వారు కోరుతుండ్రు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు