ఓటు హక్కును కాపాడాలి.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

01-11-2026 | 05:00pm

హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని యూత్ కాంగ్రెస్(Youth Congress) జమ్మికుంట మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన మహా మార్చ్‌కు మద్దతుగా ఆదివారం జమ్మికుంట గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కుకు భంగం కలిగించకూడదన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, తొలగించిన ఓట్ల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, ప్రజల్లో నమ్మకం కల్పించడంలో విఫలమైన సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఓటు హక్కు పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు వీరమనేని పరుశురాం, సుంకరి రమేష్, పర్లపెల్లి నాగరాజు, కౌన్సిలర్ శ్రీపతి నరేష్, ఒగ్గు రమేష్, చందా రాజు, అన్నం ప్రవీణ్, వాసాల రామస్వామి, మహేష్, పంజాల అజయ్, గొడుగు మానస, పాతకాల రమేష్, దేవునూరి వినయ్, రాచపల్లి సాగర్, బిజిగిరి శ్రీకాంత్, తోట స్వప్న, పిడుగు భాగ్య, బండి పవన్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు