కేంద్ర మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి భేటీ

16-10-2026 | 05:44pm

సత్తుపల్లి. అక్టోబర్ 16. ( విజయ క్రాంతి ): కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో(Union Minister Kishan Reddy) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పలు సమస్యలపై భేటీ అయ్యారు.ఈ భేటీలో మంత్రి తుమ్మల రాష్ట్ర సమస్యలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లినారు. తెలంగాణ రాష్ట్రానికి నిరంతరం యూరియా సరఫరా చేయాలని మంత్రి తుమ్మల ప్రధానంగా కోరారు.

కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి రూ 100 కోట్లు సి ఎస్ ఆర్ నిధులను కేటాయించాలని, ఆర్ ఎఫ్ సి ఎల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. అలాగే సత్తుపల్లి బ్లాక్-111 బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలని, వై టి పి ఎస్ కు మహానది బొగ్గు కేటాయించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బేటిలో విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు