నాలుగో తరగతి ఉద్యోగులకు కలెక్టర్ పండుగ కానుకలు

16-10-2026 | 08:29pm

మహబూబ్‌నగర్,  (విజయక్రాంతి): బతుకమ్మ పండుగను(Bathukamma Festival) పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా(District Collector Khushboo Gupta) తన సొంత నిధులతో కలెక్టరేట్‌లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు చీరలు పంపిణీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగులకు పండుగ కానుకలు అందజేసి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి ఏ. నిర్మల, పరిపాలన అధికారి సువర్ణ రాజు, నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు