వినాయకుడిని దర్శించుకున్న డాక్టర్ మట్టా

20-09-2026 | 12:31pm

సత్తుపల్లి.సెప్టెంబర్ 20.(విజయ క్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్‌(Hanuman Nagar)లో ఏర్పాటు చేసిన వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,పట్టణ కాంగ్రెస్ నాయకులు,వార్డు కౌన్సిలర్ హకీం, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు