జూరాల...పోలీసుల పహారా..!
20-09-2026 | 12:06pm
వనపర్తి: జూరాల ప్రాజెక్ట్ (Jurala Project) వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఎడమ కాలువ గేట్లు ఎత్తి రైతులు నీటిని విడుదల చేసుకున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో అధికారులు గేట్లను తిరిగి మూసివేశారు. దీంతో ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.