యాచకుడే.. కానీ ఆలోచన మాత్రం గొప్పది!
20-09-2026 | 11:48am
ఓ ప్రమాద గుంతపై అధికారులకు రాని ఆలోచన.. ఓ యాచకుడికి వచ్చింది! హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్(KBR Park) ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంత ప్రమాదకరంగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని భావించిన ఓ యాచకుడు ముందుకొచ్చాడు. తన వంతు బాధ్యతగా గుంతలో మట్టి పోసి పూడ్చే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.