సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

02-10-2026 | 11:19am

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటి చెప్పిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి(Mahatma Gandhi Jayanti) సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించాలని వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకుడు కాపా సుధాకర్ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన త్యాగాలు, సాగించిన పోరాటం, ప్రజాసేవ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను నేటి సమాజం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడంతో పాటు ఐక్యత, స్వచ్ఛత, శాంతి వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ప్రజలు తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కాపా సుధాకర్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు