జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
ఖమ్మంలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ
ఖమ్మం, అక్టోబర్ 8(విజయక్రాంతి): ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానెస్ కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) తక్షణమే రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన పెవిలియన్ గ్రౌండ్ నుండి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యమాన్ని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ ఏజెంట్ గా మారారని తీవ్రంగా విమర్శించారు.
దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనం, ఓటర్ల జాబితా అవకతవకలు, ఈవీఎంలపై అనుమానాలకు ప్రధాన కారణం ఈ కమిషనరే అని అన్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఓటు చోరీకి పాల్పడుతున్న జ్ఞానేష్ కుమార్ ఆ పదవిలో ఉండడానికి అనర్హుడని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి భాగం హేమంతరావు మాట్లాడుతూ - రాజ్యాంగ సంస్థలను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని, జ్ఞానేష్ కుమార్ ఒక రబ్బర్ స్టాంప్ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ నిరసన ర్యాలీలో ఇండియా కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి
*సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి నర్సయ్య, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అవునూరి మధు, సీసీఏ రవి మారుతి, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గోపగాని శంకర్, ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, శాసనసభ మాజీ సభ్యులు కొండబాల కోటేశ్వరరావు,
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, మంత్రి పొంగులేటి క్యాంపు ఇంచార్జి తుమ్మూరు దయాకర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోత్ బాలాజీ నాయక్, రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు వడ్డేబోయిన నరసింహారావు పాల్గొన్నారు.