కోహ్లీపై ఏబీడీ బిగ్ కామెంట్స్

08-10-2026 | 06:00pm

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్‌పై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తన కెరీర్‌లో మరో అత్యున్నత దశను అందుకున్నట్లుగా కనిపిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం విరాట్ ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహజమైన శైలిలో బ్యాటింగ్ చేస్తుండటం తనను ఆకట్టుకుంటోందని ఏబీడీ పేర్కొన్నాడు. కోహ్లీ ఆటలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, దూకుడు టీమిండియాకు అదనపు బలంగా మారుతుందని చెప్పాడు.

ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి కోహ్లీ ఇదే రిథమ్‌ను కొనసాగిస్తే.. అతడి ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించడమే ఆసక్తికరంగా ఉందని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ప్రస్తుత ఫామ్ అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెంచుతోంది. వచ్చే ప్రపంచకప్‌లో అతడి అనుభవం, బ్యాటింగ్ సామర్థ్యం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు