గిరిజన సంఘం మహాసభ లను జయప్రదం చేయాలి
దామరచర్ల, అక్టోబర్ : 8: ఈ నెల 10, 11వ తేదీల్లో హైదరాబాద్ లో జరిగే గిరిజన సంఘం(Tribal Association) నాలుగో రాష్ట్ర మహాసభను(State General Conference) జయప్రదం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా ఎర్రా నాయక్ పిలుపునిచ్చారు. గురువారం దామరచర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 10న జరిగే ఠానునాయక్ నంగారా ఉత్సవాలను,
11న జరిగే గిరిజన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలన్నారు. 10 తేదీ ఉదయం 11:30 గంటలకు రవీంద్ర నాయక్ నగర్ లిబ్రా హోటల్ నుండి గిరిజన కళా ప్రదర్శన ప్రారంభమవుతుందని చెప్పారు.
గిరిజన సంస్కృతిని చాటి చెప్పే విధంగా, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఉండాలని ఈ ఠాను నాయక్ నంగారా ఉత్సవాలు అలాగే మహాసభలు అని తెలియజేశారు. కావునా జిల్లా వ్యాప్తంగా గిరిజన సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాసభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.