పోషకాహారం పై అవగాహన

08-10-2026 | 05:50pm

సుల్తానాబాద్: అక్టోబర్, 08 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచిరామి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో(Anganwadi Centre) గురువారం పోషకాహార వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన పోషక విలువలు, సమతుల ఆహారం, గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారంపై వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్ రాజేశ్వరి, సర్పంచ్ ఉప్పు లక్ష్మి , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. స్వాతి, పంచాయతీ కార్యదర్శి కె. రాజేష్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు