చికిత్స పొందుతు గృహిణి మృతి..

08-10-2026 | 05:58pm

పాపన్నపేట,అక్టోబర్08: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలై ఆసుపత్రిలో చికిత్స(Hospital treatment) పొందుతు ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నాగ్సాన్ పల్లిలో గురువారం చోటుచేసుకుంది. పాపన్నపేట పోలీసులు, కూటింబీకుల సమాచారం మేరకు.. నాగ్సాన్ పల్లి గ్రామానికి చెందిన చెల్మెట్టి ఎల్లమ్మ (36) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

సోమవారం మెదక్ పట్టణానికి వెళ్లి తిరిగి స్వగ్రామమైన నాగ్సాన్ పల్లికి వచ్చేందుకు ఏడుపాయల కమాన్ వద్ద రాత్రి సమయంలో ఆటో కోసం వేచి ఉండగా ఏడుపాయల నుండి కమాన్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే క్షతగాత్రురాలైన ఎల్లమ్మను మెదక్ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి విషమించడంతో భాగ్యనగరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

గత మూడు రోజులుగా చికిత్స పొందుతు గురువారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతురాలు కుటింబీకులు పాపన్నపేట పోలీసులకు పిర్యాదు చేయడంతో పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి భర్త బీరప్ప, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు