తాగునీటి సమస్యకు చెక్‌.. లీకేజీలపై ఫోకస్‌!

18-10-2026 | 01:39pm

తిరుమలాయపాలెం, అక్టోబర్ 18 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని జూపెడ గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి చర్యలు చేపట్టారు. గ్రామంలోని పలు కాలనీల్లో లీకేజీలకు గురైన తాగునీటి పైపులను గుర్తించి, జేసీబీ సహాయంతో తవ్వకాలు చేపట్టి కొత్త పైపులను ఏర్పాటు చేయిస్తున్నారు. పైపుల (Pipelines) లీకేజీల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులను పూర్తి చేయిస్తున్నారు.

భవిష్యత్తులోనూ గ్రామంలో నీటి సమస్యలు తలెత్తకుండా లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి మరమ్మతులు చేపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. తాగునీటి సరఫరా (Water Supply) మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న సర్పంచ్‌కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. గతంలోనూ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలను పరిష్కరించేందుకు మరమ్మతులు చేయించినట్లు గుర్తుచేస్తూ, గ్రామంలో మౌలిక సదుపాయాలు (Infrastructure) మెరుగుపడాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు