భక్తులకు అన్నప్రసాద వితరణ
మఠంపల్లి అక్టోబర్ 18 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా,కాల్వపల్లి తండా శ్రీ ఆంజనేయ స్వామి(Anjaneya Temple) దేవాలయం నందు ఏర్పాటు చేసిన దుర్గమ్మ తల్లి నవరాత్రుల సందర్భంగా ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ పెద్ద చంద్రు నాయక్తో కలిసి సర్పంచులు మాలోతు సక్రు నాయక్,బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.ఈ సందర్భంగా సర్పంచ్లు నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదానం మహాదానమని,ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.దుర్గమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ నాగరాజు,మాజీ ఎంపిటిసి భరత్ నాయక్, నిర్వాహకులు విజయ, ఉపసర్పంచ్ నితిన్,బాలు, బ్రహ్మ చారి,వార్డు సభ్యులు రమేష్,నాగేశ్వరరావు, హేమ,హభి,గ్రామ పెద్దలు,భవాని యుత్ యువకులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.