గొత్తికోయ కుటుంబాలకు దుస్తుల పంపిణీ

18-10-2026 | 02:23pm

వెంకటాపూర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మండలంలోని తొర్రిచింతలపాడు గొత్తికోయ గూడెంలో ఆదివారం కడవాడ యూత్ అసోసియేషన్(Kadawada Youth Association) అధ్యక్షుడు గుర్రాల లోకేష్ ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకొని 30 గొత్తికోయ కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు లోకేష్ మాట్లాడుతూ.. నిరుపేదలు, ఆదివాసీ కుటుంబాలు, బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ ఆదివాసీ గూడేల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రజినీకర్, ప్రధాన కార్యదర్శి సర్వేష్, కార్యదర్శి వరుణ్, కోశాధికారి సతీష్‌, సభ్యులు కార్తీక్, అజయ్, రంజిత్, రాజేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు